మంధర దుర్బోధ : వనం జ్వాలా నరసింహారావు (2024)

మంధర దుర్బోధ

వనం జ్వాలా నరసింహారావు

భక్తి పత్రిక మేనెల, 2024

(శివధనస్సును ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతను గెలుచుకున్నాడు.సీతాకల్యాణం కమనీయంగా జరిగింది. అటుపై పరశురాముడు అందించిన విష్ణు ధనువునూఎక్కుపెట్టాడు. దశరథుడు జరపదల్చుకున్న శ్రీరామపట్టాభిషేకం కైక వరాల కారణంగావాయిదాపడింది. మంధర చేసిన దుర్బోధ శ్రీరామ వనవాసానికి నాంది పలికింది.)

సీతా కల్యాణం అనంతరం బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హిమాలయాలకు వెళ్లిపోయాడు.దశరథుడు, కొడుకులు, కోడళ్లు పరివారంతో కలిసి అయోధ్యకు ప్రయాణమయ్యారు. దారిలో గండ్రగొడ్డలినిధరించి పరశురాముడు కోపంగా వచ్చాడు. శ్రీరాముడిని సమీపించి, శివుడి విల్లు విరిచిన నీబలాన్ని స్వయంగా పరీక్షించాలని వచ్చానన్నాడు, తన దగ్గర వున్న విష్ణువువిల్లును ఎక్కుబెట్టి, క్షత్రియ వంశంలో పుట్టిన రాముడు తనబలం నిరూపించుకోవాలని చెప్పాడు.అలా రాముడు చేయగలిగితే ఆయనతో ద్వంద్వ యుద్ధంచేస్తానని అన్నాడు. పరశురాముడు రెండు విల్లులవృత్తాంతం కూడా చెప్పాడు.

కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి వెంటనే వింటిని లాగి, ఎక్కుపెట్టాడు. ఒక బాణాన్ని సంధించాడు,కానీ పరశురాముడు తన గురువైన విశ్వామిత్రుడిబంధువైనందున, అతడిమీద బాణాన్ని ప్రయోగించడానికిమనసొప్పుకోవడంలేదని అన్నాడు. ప్రత్యామ్నాయంగా, పరశురాముడు ఎంతమాత్రంనడవ లేకుండా, ఒక దిక్కున పడే విధంగా అతడి కాళ్ల గమనవేగాన్నిగానీ,లేదా, ఆయన తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనుగానీ,తన బాణంతో ఖండిస్తాననీ, ఏది కావాలో కోరుకొమ్మనీఅవకాశం ఇచ్చాడు. విష్ణు సంబంధమైన బాణం కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదని, సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుందని, దేనినిఖండించాలో చెప్పమని అంటాడు. బాణాన్ని విడిచి, తన కీర్తిని నాశనం చేయమని పరశురాముడు చెప్పాడు. శ్రీరాముడు అలాగే చేసిన తరువాత పరశురాముడు ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడు.

పట్టాభిషేకానికి ఏర్పాట్లు

దశరథుడి బృందం అయోధ్యకు చేరుకున్నది. కొంతకాలానికి తండ్రిఆజ్ఞ ప్రకారం శత్రుఘ్నుడితో కలిసి, భరతుడు మేనమామ ఇంటికి వెళ్లాడు. అయోధ్యలోనే వున్న శ్రీరామచంద్రమూర్తి,తమ్ముడు లక్ష్మణుడుతో కలిసి,తండ్రి ఆజ్ఞ ప్రకారంప్రజలకు మేలైన, సంతోషకరమైన కార్యాలను చేస్తుండేవాడు. ఈ నేపధ్యంలో, శ్రీరాముడిని అయోధ్యా రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయాలని దశరథుడు ఆలోచించాడు. మంత్రులతో ఆలోచించి నిర్ణయంతీసుకుందామని నిశ్చయించుకుంటాడు. యోగ్యుడు,సమర్థుడు, ఎదిగినవాడైన కుమారుడు, వుండగా ఇంకా రాజ్యభారం వహించడం ధర్మం కాదని భావించాడు దశరథుడు. అయితే తనతదుపరి కొడుకును ఇష్ట ప్రకారం పట్టాభిషేకం చేసే అధికారం తనకి లేదని, రాజ్యంప్రజలదని, రాజ్యాన్నిపరిపాలించే శక్తి ఎవరికి కలదో, వానినే, పట్టాభిషిక్తుడిని చేసే అధికారం ప్రజల కుందని దశరథుడు అనుకుంటాడు.

మంధర దుర్బోధ : వనం జ్వాలా నరసింహారావు (1)

మంధర దుర్బోధ : వనం జ్వాలా నరసింహారావు (2)

ఆలోచన చేసేందుకు, సామంతులను, మంత్రులను, గ్రామాలలో వుండేవారిని కూడా పిలిపించి దశరథుడు వారినిసంప్రదించాడు. అందరూ ముక్తకంఠంతో మేలు-మేలు అని, బాగు-బాగు అని కేకలు వేశారు. దశరథుడిని శ్లాఘించారు. అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా పౌరుల సమ్మతి తీసుకుని శ్రీరాముడికిపట్టాభిషేకం చేయాలన్న నిర్ణయానికి దశరథుడు వచ్చాడు. జరగబోయే రామపట్టాభిషేనిర్ణయాన్ని హర్షిస్తూ ప్రజలువాడవాడలా సంబురాలు జరుపుకుంటూ సంతోషంగా, కోలాహలంగాసందడి చేయసాగారు.

చుప్పనాతి మాటలు

దశరథుడిముద్దుల భార్య కైక. ఆమె దాసి అయినమంధర, ప్రజల కోలాహాలాన్ని చూసింది. విషయమేమిటని ఒక స్త్రీ మూర్తిని అడిగింది. శ్రీరాముడికి దశరథుడు యౌవరాజ్యపట్టాభిషేకం చేయనున్నాడని తెలుసుకుని బిరబిరాకైక వద్దకు పోయింది. శ్రీరామపట్టాభిషేక వార్త కైకకు చేరకుండా దశరథుడు జాగ్రత్త పడ్డాడు. తెలిస్తే ఆమె మనస్సులో వికారం కలిగి,విఘ్నం చేయవచ్చని ఆయన అనుమానం.

శ్రీరాముడి పట్టాభిషేకం జరుగనున్న విషయాన్ని కైకకుచేరవేస్తూ మంథర, ఆమెలో రాముడి పట్ల లేనిద్వేషాన్ని కలిగించింది. ఆమెకు ఏమీ తెలియదని,చెడిపోయే కాలం వచ్చిందని, మౌనంగా వుంటే కీడు కలగవచ్చని రెచ్చగొట్టింది. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపిస్తే, సమస్తం కైక సవతి కౌసల్యకు ఇస్తే, కైకకు, ఆమె కుమారుడు భరతుడికి అన్యాయం జరుగుతుందని వక్రభాష్యంచెప్తుంది. అలా మంథరచెప్పినప్పటికీ, ఆ వార్తనుశుభ వార్తలాగా పరిగణించిన కైక ఆమెకు బహుమానంగా తన మెడలోని బంగారు ఆభారానాన్నిఇస్తుంది. తన మాట అర్థం చేసుకోలేదని మంథరకు కోపమొచ్చింది. ఆమె తనకుఇచ్చిన సొమ్మును విసిరి పారవేసింది. కైక సంతోషించాల్సిన సమయం కాదు అంటుంది. కైకమనస్సు చీకాకు పడే మాటలు పదే పదేచెప్పి, దుర్బోధచేసి ఆమె మనసు మార్చింది.

మంథరచెప్పిందే సరైనదిగా అనిపించింది కైకకు. తన కొడుకుకురాజ్యం రావాలని, రాముడికి పట్టాభిషేకం కాకూడదని, తన కొడుకు రాజు కావడానికిమంచి ఆలోచన, ఉపాయం చెప్పమని అడిగింది.సమాధానంగా దేవదానవుల యుద్ధాన్ని, ఇంద్రుడు దశరథుడునిసాయంగా రమ్మన్న సందర్భాన్ని గుర్తు చేసింది మంథర. దశరథుడు రాక్షసుల వల్ల గాయపడి రథంమీద మూర్ఛపోయినప్పుడు రెండు సార్లు రాక్షసుల బారిన పడకుండా భర్త ప్రాణాన్ని తోడుగావున్న కైక కాపాడిన విషయాన్ని, రెండుసార్లు ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు దశరథుడుఆమెకు రెండువరాలిచ్చినప్పటికీ ఆ వరాలనుఅప్పుడు కోరకుండా, ఇష్టంవచ్చినప్పుడు అడుగుతానంటే, అలాగేకానిమ్మని దశరథుడు అన్న మాటలనుగుర్తుచేసింది మంథర. వాటిని ఇప్పుడు అడగమని, చెపుతూ, ఏం అడగాలో కూడాతెలియచేసింది. మంథరను మెచ్చుకున్న కైక కోప గృహంలో ప్రవేశించింది.

కైకమ్మ వరాలు

శ్రీరాముడిపట్టాభిషేక వార్త కైకకు చెప్పాలనుకున్నదశరథుడు ఆమె అంతఃపురంలోకిప్రవేశించాడు. ఆమె కోప గృహంలో వుందని విని, అక్కడికి వెళ్లి, కైక కోపానికికారణం అడిగాడు. తన కోరిక తీరుస్తానని దశరథుడు ప్రమాణం చేసిన తరువాత, గతంలో భర్త తనకు ఇచ్చిన వరాల విషయాన్నిజ్ఞాపకం చేసుకోమని, అవి ఇప్పుడు కావాలనిఅంటుంది. శ్రీరాముడికి దశరథుడు చేస్తున్న పట్టాభిషేక ప్రయత్నం నిలిపి,దానికి బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమని, శ్రీ రామచంద్రుడు నార చీరెలుకట్టుకుని, పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో తిరగాలని,రెండు వరాలను కోరుకున్నది.

కైకేయిమాటలను విన్న దశరథుడు, వెంటనే మూర్ఛపోయాడు.అతి కష్టం మీద తెలివి తెచ్చుకుని గుండెలు చెదిరేలా దుఃఖించాడు. కైకను పరిపరివిధాలుగా దూషించాడు. రఘు వంశాన్ని నాశనం చేయడానికే వచ్చిందనీ,చెడ్డ పని తలపెట్టిందనీ, ఎలా తానుశ్రీరామచంద్రుడిని అడవులకు పొమ్మని ఆజ్ఞాపించగలననీ,వరాలు ఉపసంహరించుకోమనీ వేడుకున్నాడు. అతడి మాటలను ఆక్షేపిస్తూ కైక, వరాలు ఇస్తానని ప్రమాణం చేసి,తనను నమ్మించి,అవి ఇవ్వడానికి వగలమారి ఏడుపులతో మోసగిద్దామనుకోవడం మంచిది కాదని అన్న కైకతో దశరథుడున్యాయ నిష్టూరాలు ఆడాడు. శ్రీరాముడు అరణ్యానికి పోతే తన మరణం సంభవించడం తథ్యమని కూడా అన్నాడు.

దశరథుడుఅనదల్చుకున్న మాటలన్నీ అన్న తరువాత మెత్తనిమాటలతో కైకను బతిమిలాడాడు. తనకు వరాలిస్తాననిప్రమాణం చేసిన దశరథుడినిధర్మమేంటో ఆలోచించమన్నది. చేసినప్రమాణం తీర్చడం ధర్మమో, తీర్చకుండా వుండడం ధర్మమో ఆలోచించమన్నది. సత్యం తప్పవద్దని బోధించింది. ధర్మంవిడుస్తాడో, శ్రీరాముడినివిడుస్తాడో తేల్చుకోవాలన్నది. తనకిచ్చిన ప్రమాణంతక్షణమే నెరవేర్చకపోతే, భర్త పాదాల మీద పడి,ప్రాణాలు తీసుకుంటానని బెదిరించింది. దశరథుడు ఏం చేయాలో తోచక కలత చెందాడు. ఇవేమీ తెలియని వశిష్ఠుడు, రాజువుండే అంతఃపురానికి వెళ్లగానే, దశరథుడికిఆయన రాక గురించి మంత్రిసుమంత్రుడికి తెలియచేసి, శ్రీరామ పట్టాభిషేక కార్యంనెరవేర్చమని అంటాడు.

వనవాసానికి ఏర్పాట్లు

వెంటనే కైక, దశరథ మహారాజురమ్మంటున్నారని చెప్పి శ్రీరామచంద్రుడిని అక్కడికిపిలుచుకురమ్మని సుమంత్రుడికిచెప్పింది. ఆ విషయం సుమంత్రుడు చెప్పగానే, లక్ష్మణ సహితంగా బయల్దేరి,అంతఃపురంలోకి వెళ్లాడు శ్రీరాముడు. దశరథుడిపరిస్థితి చూసి విచారపడ్డాడు. అప్పుడురాముడికి కైక తన వరాల సంగతిని చెప్పింది. తండ్రిమాట పాలించదల్చుకుంటే, తన వరాలనునెరవేర్చమన్నది. పద్నాలుగేండ్లు అరణ్యాలలో సంచరించడానికితక్షణమే బయల్దేరాలని చెప్పింది. ఆయనఅభిషేకానికై సిద్ధపరిచిన సామాగ్రిఅంతా భరతుడికి ఇవ్వాలనీ చెప్పింది. వెంటనే రాముడు, తాను జడలు ధరించి,నార వస్త్రాలు కట్టుకుని, భయంకరమైనఅడవులకు పోయి, తండ్రి మాటలు యథార్థం చేస్తానన్నాడు. తనకు తండ్రి ఆజ్ఞ ఎలాంటిదో తల్లి ఆజ్ఞకూడా అలాంటిదేనన్నాడు.

అడవులకుపోవడానికి సిద్ధపడ్డ శ్రీరాముడు, తండ్రికిప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కైకకూ నమస్కారంచేశాడు. తల్లి కౌసల్య ఆజ్ఞ, సమ్మతి తీసుకుని సీతాలక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ల వనవాసానికి పోవడానికిపూర్వం శ్రీరాముడు మరోసారి తండ్రి దశరథుడి వద్దకు వెళ్లాడు. శ్రీరాముడుతనను వదలి పోతున్నాడనే బాధతో, దుఃఖంతో,గుండె చెదరిన దశరథుడు, కొడుకునుకౌగలించుకుని, శవంలాగా కాళ్లు చేతులాడించకుండా నేల మీదపడిపోయాడు.సుమంత్రుడు తోలుతున్న రథం ఎక్కి అడవులకు బయల్దేరారు సీతారామలక్ష్మణులు.

(ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారి రామాయణం మందరంఆధారంగా)

మంధర దుర్బోధ : వనం జ్వాలా నరసింహారావు (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Velia Krajcik

Last Updated:

Views: 6193

Rating: 4.3 / 5 (74 voted)

Reviews: 81% of readers found this page helpful

Author information

Name: Velia Krajcik

Birthday: 1996-07-27

Address: 520 Balistreri Mount, South Armand, OR 60528

Phone: +466880739437

Job: Future Retail Associate

Hobby: Polo, Scouting, Worldbuilding, Cosplaying, Photography, Rowing, Nordic skating

Introduction: My name is Velia Krajcik, I am a handsome, clean, lucky, gleaming, magnificent, proud, glorious person who loves writing and wants to share my knowledge and understanding with you.